మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు బెయిల్
రెండేళ్ల తర్వాత మంజూరు చేసిన కోర్టు
ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు ఊరట లభించింది. ఈ మేరకు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది కోర్టు. మనీ లాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత సత్యేందర్ జైన్ కు బెయిల్ లభించడం విశేషం.
ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సత్యేందర్ జైన్ ను గత మే 30, 2022న ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనకు నాలుగు కంపెనీలతో లోపాయికారి ఒప్పందం కలిగి ఉన్నారంటూ ఆరోపించింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
విచారణలో జాప్యం, 18 నెలల సుదీర్ఘ జైలు శిక్షను పరిగణనలోకి తీసుకుంటే, విచారణ ప్రారంభించడానికి చాలా సమయం పడుతుంది, ముగియడానికి మాత్రమే కాకుండా, నిందితుడు ఉపశమనం కోసం అనుకూలంగా ఉంటాడు అని విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే పేర్కొన్నట్లు సమాచారం.
రూ. 50 వేలతో పాటు ఇద్దరు పూచీకత్తుపై సత్యేందర్ జైన్ బెయిల్ పై విడుదలయ్యారు. ఇదిలా ఉండగా అవినీతి నిరోధక చట్టం కింద 2017లో సీబీఐ జైన్ పై కేసు నమోదు చేసింది. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. కాగా ఆప్ నుంచి ఇప్పటికే ఇద్దరు నేతలు బయటకు వచ్చారు. ఒకరు మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా కాగా మరొకరు మాజీ సీఎం కేజ్రీవాల్.