NEWSANDHRA PRADESH

ఎవ‌రు త‌ప్పు చేసినా శిక్ష త‌ప్ప‌దు – సీఎం

Share it with your family & friends

టీడీపీ ఏనాడూ ప‌ద‌వుల కోసం ప‌ని చేయ‌లేదు

అమ‌రావ‌తి – ఎవ‌రు త‌ప్పు చేసినా ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.
టీడీపీ ఏనాడూ పదవుల కోసం పని చేయలేదన్నారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. అత్యంత శక్తివంతమైన పార్టీగా ఆవిర్భవించిందని అన్నారు.

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు టీడీపీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్ర‌వారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇంఛార్జులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై నేతలకు దిశనిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మట్లాడుతూ 125 రోజుల పాలనలో మనం చేసిన మంచి పనులు సమీక్షించుకుని ముందుకెళ్లాలని అన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఎన్డీయే అధికారంలో ఉందన్నారు. మొన్నటి ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. పార్టీని సమన్వయం చేసుకోవడంతో పాటు మద్ధతు ఇచ్చిన ప్రజల ఆశలు నెరవేర్చాలన్నారు.

గత ఐదేళ్లు కార్యకర్తలు అన్ని విధాలా నష్టపోయి, త్యాగాలు చేసి కష్టపడ్డారని అన్నారు చంద్ర‌బాబు నాయుడు. కార్యకర్తలు, నేతలు గత ఐదేళ్లలో పడ్డ ఇబ్బందులు ఎప్పుడూ చూడ లేద‌న్నారు . రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవస్థలను భ్రస్టు పట్టించారని ఆరోపించారు. ఏ విభాగంలోనూ ఆడిట్ చేయలేదు. కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించారని అన్నారు.

పంచాయతీలకు ఇవ్వాల్సిన రూ.990 కోట్లు మళ్లించారని…దీంతో రూ.12 వందల కోట్లు రాకుండా పోయాయ‌ని వాపోయారు. మనం వచ్చాక రూ.990 కోట్లు చెల్లించడం వల్ల రూ.12 వందల కోట్లు పంచాయతీలకు రాబోతున్నాయ‌ని తెలిపారు.

టీడీపీ కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు…పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చామ‌ని మ‌రిచి పోకూడ‌ద‌న్నారు.

ప్రధాని మోదీని చూసి నేర్చుకోవాల్సింది ఆయనకున్న పట్టుదల, కృషి. 3 సార్లు ప్రధాని అయినా మళ్లీ రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నారు. దేశంలో ఎవరికీ రాని విజయం మోదీ సాధించారంటే దాని వెనక కఠోరమైన శ్రమ, క్రమశిక్షణ ఉందన్నారు.

ఎన్నికల్లో పొలిటికల్ సోషల్ రీ ఇంజనీరింగ్ చేశాం. టీడీపీకి అండగా ఉన్న బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం. ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాని వర్గాలకు సీట్లు ఇచ్చాం. ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలబడాలి అని నినాదం ఇచ్చాం. ఇప్పుడు గెలిచాం కాబట్టి మన పని అయిపోయిందని అనుకోకూడదు అన్నారు సీఎం.

సంఘటిత శక్తిగా ఏర్పడి మంచిపని చేస్తేనే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండాలి. ప్రభుత్వంలో చివరి ఉద్యోగి తప్పు చేసినా సీఎంను అంటారు. ఎన్డీయేలో ఏ కార్యకర్త తప్పు చేసినా అది సీఎం వైపే చూపెడతారు. పార్టీ, ప్రభుత్వం నుండి తలెత్తేవి నావైపే చూపిస్తారు. మీరు మంచి చేసినా, తప్పు చేసినా అవి పార్టీ, ప్రభుత్వానికి వర్తిస్తాయి. అందరికీ ఒకటే చెప్తున్నా….మనం ప్రవర్తించే ప్రధానమే మనకు వచ్చే మెజార్టీపై ఆధారపడి ఉంటుందన్నారు చంద్ర‌బాబు నాయుడు.