NEWSTELANGANA

గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌పై చైర్మ‌న్ స‌మీక్ష

Share it with your family & friends

జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్

హైద‌రాబాద్ – టీజీపీఎస్సీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించడంతో రంగంలోకి దిగారు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్ మ‌హేంద‌ర్ రెడ్డి. ఇప్ప‌టికే సీఎస్ శాంతి కుమారి వీడియా కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. తాజాగా టీజీపీఎస్సీ చైర్మ‌న్ ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, సూప‌రింటెండెంట్ లతో స‌మావేశం చేప‌ట్టారు.

ఈ సందర్భంగా మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై పలు సూచనలు జారీ చేశారు. జిల్లాలలో చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి, అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయో లేవో పరిశీలించాలని, ఈ ప్రక్రియ ఇవాల్టితో పూర్తి చేయాలని కమిషన్ చైర్మన్ కలెక్టర్లను ఆదేశించారు.

పరీక్ష కేంద్రాల ధృవీకరణ పూర్తయిన తర్వాత అభ్యర్థుల వివరాలతో కూడిన ఓఎంఆర్ షిట్ల ముద్రణ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నా పత్రాలు, ఇతర ముఖ్యమైన సామాగ్రి భద్ర పర్చేందుకు స్ట్రాంగ్ రూమ్ లను గుర్తించాలని అన్నారు.

పరీక్షలు సజావుగా సాగేందుకు వీలుగా జిల్లాలోని ఒక ప్రాంతంలో ఉన్న పరీక్షా కేంద్రాలకు రీజనల్ కోఆర్డినేటర్లను నియమించాలని అన్నారు. గ్రూప్ 3 పరీక్షకు 3 పేపర్, గ్రూప్ 2 పరీక్ష 4 పేపర్లు పెద్ద ఎత్తున సభ్యులు ఉన్న నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్ పరిధిలో స్ట్రాంగ్ రూమ్ గుర్తించాలని అన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ పరిధిలో అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన మేర స్ట్రాంగ్ రూమ్ ఉండాలని అన్నారు