కాంగ్రెస్ వస్తేనే ప్రత్యేక హోదా
స్పష్టం చేసిన వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఏపీ తల రాత మారాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. తాము పవర్ లోకి వస్తేనే ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు .
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో కొలువు తీరిన జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్షాలైన చంద్రబాబు నాయుడు ఇద్దరూ మోసం చేశారని ఆరోపించారు. వీరికి తోడు బీజేపీ కూడా తయారైందని ధ్వజమెత్తారు.
టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల వల్ల ఏపీకి ఒరిగేది ఏమీ ఉండదన్నారు. ఈ మూడు పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని ఈ విషయం గ్రహిస్తేనే ఏపీకి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యున్నతమైన కార్యకర్తల బలగం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించడం ఖాయమని జోష్యం చెప్పారు. మిస్డ్ కాల్ తో పార్టీలో చేరవచ్చని సూచించారు.