భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ దేశానికి రోల్ మోడ‌ల్

చేస్తామ‌ని ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ రైజింగ్ విజ‌న్ -2047 డాక్యుమెంట్ దేశానికి ఓ రోల్ మోడ‌ల్ గా మార‌నుంద‌ని పేర్కొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఓఆర్ఆర్ అంతర్భాగంలో ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా గుర్తించాం అన్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ వంటి 4 రకాల పాలన సాగుతుండేదని అన్నారు.

ఈ మహానగరం ఎదుర్కొంటున్న రకరకాల ఇబ్బందులు, కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ గా గుర్తించామ‌న్నారు. ప్రధానంగా పారిశ్రామిక కాలుష్యం, మూసీ, పురాతన వాహనాలు, వాయు కాలుష్యం వంటి వాటిని తగ్గించడం ద్వారా నెట్ జీరో నగరంగా మార్చాలని ప్యూర్ గా నిర్దేశించిన‌ట్లు తెలిపారు.

దేశంలో మెట్రోపాలిటన్ నగరాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. అలాంటి సంక్షోభాలను హైదరాబాద్ నగరానికి ఎదురు కాకుండా ఉండేందుకు 2170 చదరపు కి.మీ కోర్ అర్బన్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్‌గా గుర్తిస్తున్నాం. కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలను బయటకి తరలిస్తున్నాం. వరద సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌క‌టించారు. అలాగే కోర్ అర్బన్ రీజియన్ ఒక యూనిట్‌గా మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధి రోడ్ల విస్తరణ వంటి అన్ని రకాల ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా గుర్తించి సర్వీస్ సెక్టర్‌గా మార్చుతున్నామ‌ని తెలిపారు సీఎం.

ఓఆర్ఆర్ అవతలి వైపు నుంచి తెలంగాణకు మణిహారంలా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు వరకు పెరీ అర్బన్ ఎకానమీ కింద (ప్యూర్) గుర్తించి ఆ ప్రాంతంలో మాన్యుఫాక్చరింగ్ జోన్‌గా నిర్దేశించడం జరిగింది. అందులో ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లు, బెంగుళూరు – హైదరాబాద్, అమరావతి మీదుగా హైదరాబాద్ – చెన్నై బుల్లెట్ ట్రెయిన్స్ ప్రతిపాదించాం. వీటి వల్ల రవాణా సులభతమవుతుందని అన్నారు. తెలంగాణకు సముద్రం లేని కారణంగా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో మచిలీపట్నం పోర్టు వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించ బోతున్నాం. ఇందుకోసం ఇప్పటికే కేంద్రం, ఏపీ రాష్ట్రాలతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి.

పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల కోసం పటిష్టమైన రవాణా వ్యవస్థ ఉండాలి. మాన్యుఫాక్చరింగ్ జోన్‌లో హైవేలు, పోర్టు కనెక్టివిటీ, ఎయిర్ పోర్టు కనెక్టివిటీ ఉండాలి. వరంగల్‌లో నిర్మిస్తున్న విమానాశ్రయంతో పాటు ఆదిలాబాద్, కొత్తగూడం, రామగుండంలో ఎయిర్ పోర్టులు అదనంగా తెస్తాం. కనెక్టివిటీ పెంచడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలం అన్నారు.

  • Related Posts

    నేటి నుంచి ప్ర‌జా ప్ర‌భుత్వ ఉత్స‌వాలు

    డిసెంబ‌ర్ 6వ తేదీ వ‌ర‌కు అన్ని జిల్లాల్లో హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు ఉమ్మడి జిల్లాల్లో ఒకరోజు ఉత్సవాలను నిర్వహించనున్నారు.డిసెంబర్ 1 వ తేదీన మక్తల్‌లో, 2 వ తేదీన…

    సిరిసిల్ల జిల్లా అధ్య‌క్షుడిగా సంగీతం శ్రీ‌నివాస్

    ప్ర‌మాణ స్వీకారం చేయించిన మంత్రి పొన్నం రాజ‌న్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోరు కొన‌సాగుతోంద‌న్నారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంగీతం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *