NEWSINTERNATIONAL

ఈవీఎంలు వ‌ద్దు బ్యాలెట్ పేప‌ర్ ముద్దు

Share it with your family & friends

ఎలోన్ మ‌స్క్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అమెరికా – టెస్లా చైర్మన్, ఎక్స్ సిఈఓ ఎలోన్ మ‌స్క్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్ కు సంబంధించి త‌న అభిప్రాయాల‌ను బ‌హిరంగంగా వెల్ల‌డించారు. ఎలోన్ మ‌స్క్ ముందు నుంచీ అమెరికా దేశ మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా ఉన్నారు. ఇద్ద‌రూ మంచి స్నేహితులు.

గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా ట్రంప్ ను సామాజిక దిగ్గ‌జం ట్విట్ట‌ర్ నిషేధం విధించింది. దీంతో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేశాడు. పాత టీంను పంపించేశాడు. ప్ర‌స్తుతం త‌న ఆధ్వ‌ర్యంలోనే దీనిని నిర్వ‌హిస్తున్నాడు. ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వ‌స్తున్నాడు ఎలోన్ మ‌స్క్.

తాజాగా ట్విట్ట‌ర్ పేరును తీసేశాడు. దానిని ఎక్స్ గా నామ‌క‌ర‌ణం చేశాడు . ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఈవీఎంల గురించి ప్ర‌త్య‌కంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ త‌రుణంలో అమెరికాలో ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఈవీఎంలు కాకుండా పేప‌ర్ బ్యాలెట్ ల‌ను ఏర్పాటు చేయాల‌ని కోరాడు.

ఎందుకంటే త‌నకు టెక్నాల‌జీపై పూర్తి అవ‌గాహ‌న ఉంద‌ని, ఈవీఎంల‌ను హ్యాకింగ్ చేసేందుకు ఆస్కారం ఎక్కువ‌గా ఉంద‌న్నాడు. అదే పేప‌ర్ బ్యాలెట్ అయితే అలా చేసేందుకు ఆస్కారం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశాడు ఎలోన్ మ‌స్క్. దీంతో మ‌స్క్ చేసిన తాజా కామెంట్స్ వ‌ర‌ల్డ్ వైడ్ గా క‌ల‌కలం రేపుతున్నాయి.