NEWSANDHRA PRADESH

పారదర్మకం గా ఉచిత ఇసుక అమలు

Share it with your family & friends

నాణ్యమైన మద్యం రూ..99కేన‌న్న మంత్రి

అమ‌రావ‌తి – జగన్మోహన్ రెడ్డి ఇసుక, మద్యం లో దోపీడి జరిగిందని మొసలి కన్నీరు కార్చున్నారని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం తెలగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం అధికారంలొకి రాగానే జూలై 8వ తేదీన ఉచిత ఇసుక అమలు చేశామ‌న్నారు. గత ఐదేళ్లు అక్రమ ఇసుక ద్వారా రూ. 1000 కోట్లు జగన్ రెడ్డి దోచుకున్నార‌ని ఆరోపించారు.. నేడు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉచిత ఇసుక రాష్ట్ర ప్రజలకు అందించడం జరుగుతోందని చెప్పారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌.

గతంలో ఎద్దుల బండికి మాత్రమే ఉచిత ఇసుక రవాణా ఉండేదని, కానీ త‌మ ప్ర‌భుత్వం ట్రాక్టర్ ఉచిత ఇసుకకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్ వేసుకొని ఉచిత ఇసుకను తాడేపల్లి ప్యాలెస్ కి తీసుకెళ్లమని ఆయన అన్నారు.

గత ఐదేళ్లు మైనింగ్ విధానాన్ని కూడా భ్రష్టు పట్టించారని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులను సర్వ నాశనం చేశారని వాపోయారు. వైసీపీ హయాంలో తాడేపల్లి ప్యాలెస్ కి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి ఆదాయం రాలేదుని మండిపడ్దారు..

అక్రమంగా ఇసుక తవ్వకాలు చేయడం వలన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వైసీపీ నాయకులకు రూ. 100 కోట్లు జరిమానా విధించడం నిజం కాదా ? వైసీపీ తొత్తులుగా పని చేసిన కలెక్టర్లను కోర్టులకు వెళ్లేలా చేసి సంజాయిషీ చేప్పుకునేలా జగన్ రెడ్డి చేశారని అన్నారు.

కంటెంట్ ఆఫ్ కోర్టు కింద నోటీసులు ఇచ్చింది వాస్తవం కాదా ? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ద్వారా సెమీ మెకానిజం పెట్టి కోట్ల రూపాయల ఇసుకను దోపిడీ చేసింది నిజం కాదా ? వైసీపీ చేసిన అనైతిక విధానాల వలన 130 రీచ్ లు సీజ్ చేశార‌ని అన్నారు. దీంతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని వాపోయారు కొల్లు ర‌వీంద్ర‌.

వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని దీనికి జ‌గ‌న్ రెడ్డి బాధ్య‌త వ‌హించాల‌ని అన్నారు. వైసీపీ చేసిన అరాచకాలు వలన ఎన్జీటీ కఠిన తరమైన నిర్ణయాలు తీసుకుంద‌న్నారు . దీంతో అన్నీ రీచ్ లు తెరవలేక పోతున్నామని మంత్రి తెలిపారు.