ENTERTAINMENT

స‌ల్మాన్ ఖాన్ క్ష‌మాప‌ణ చెప్ప‌డు – స‌లీం ఖాన్

Share it with your family & friends

బిష్ణోయ్ క‌మ్యూనిటీకి స్ప‌ష్టం చేసిన తండ్రి

ముంబై – ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు , తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న స‌ల్మాన్ ఖాన్ తండ్రి స‌లీం ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న కొడుకు ఎట్టి ప‌రిస్థితుల్లో క్ష‌మాప‌ణ చెప్పేది లేద‌ని స్ప‌ష్టం చేశాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

త‌న కొడుకు కృష్ణ జింక‌ను ఎప్పుడూ చంప లేద‌న్నారు. బొద్దింక‌ను కూడా చంప లేద‌ని తెలిపాడు. ఈ విష‌యాల‌పై త‌మ‌కు ఏ మాత్రం న‌మ్మ‌కం లేద‌న్నారు స‌లీం ఖాన్. ఈ సంద‌ర్బంగా ప‌లు ప్ర‌శ్న‌లు సంధించాడు ఇంట‌ర్నేష‌న‌ల్ గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ కి.

స‌ల్మాన్ ఖాన్ నేరం చేసిన‌ప్పుడు చూశావా..? ఈ విష‌యంపై ఏనాడైనా ద‌ర్యాప్తు చేశావా అని నిల‌దీశారు స‌లీం ఖాన్. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే 7 రోజుల పాటు జైలు శిక్ష అనుభ‌వించి బ‌య‌ట‌కు వ‌చ్చారు స‌ల్మాన్ ఖాన్.

గ‌త కొంత కాలం నుంచి లారెన్స్ బిష్ణోయ్ బాలీవుడ్ న‌టుడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కృష్ణ జింక‌ను త‌మ క‌మ్యూనిటీ దైవంగా భావిస్తార‌ని, బ‌హిరంగంగా క్షమాప‌ణ చెప్పాల‌ని లేక పోతే తీవ్ర చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. అంతే కాకుండా త‌న గ్యాంగ్ కు చెందిన వారితో ఇటీవ‌లే స‌ల్మాన్ ఖాన్ కు స్నేహితుడైన మాజీ మంత్రి బాబా సిద్దిఖ్ ను కాల్చి వేశారు. దీంతో స‌ల్మాన్ ఖాన్ మ‌రోసారి తెర పైకి వ‌చ్చాడు.