కేటీఆర్..హరీశ్ ..బుల్డోజర్ తో జాగ్రత్త – సీఎం
సంచలన కామెంట్స్ చేసిన ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్ , తన్నీరు హరీశ్ రావులను టార్గెట్ చేశారు. శనివారం జరిగిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు ఈ ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు, విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు.
గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలిన వీరికి పదవులు పోయే సరికల్లా తట్టుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు ఎ. రేవంత్ రెడ్డి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తమది ప్రజా ప్రభుత్వమని మరోసారి స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కేవలం అభివృద్ది పైనే ఫోకస్ పెట్టామన్నారు. అందులో భాగంగానే మూసీ సుందరీకరణకు శ్రీకారం చుట్టామన్నారు. ఇందు కోసం లక్షా 50 వేల కోట్లు కావాల్సి వస్తుందన్నారు.
ఇదే సమయంలో తాము చేసే పనులను అడ్డుకోవాలని చూసినా లేదా నిలబడినా కేటీఆర్, హరీశ్ రావులతో పాటు ఇతరులు ఎవరు వచ్చినా బుల్డోజర్లు తొక్కుకుంటూ పోతాయని హెచ్చరించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఘాటు కామెంట్స్ కలకలం రేపుతున్నాయని, అందుకే జర జాగ్రత్తగా ఉండాలని సూచించారు సుతిమెత్తగా.