జీవో 29 రద్దు చేయండి – బండి
డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ . శనివారం ఆయన ఆందోళన చేపట్టారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహించాలని కోరారు. కానీ సర్కార్ పట్టించుకోక పోవడం దారుణమన్నారు బండి సంజయ్ కుమార్.
వెంటనే జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అభ్యర్థుల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సీఎం వెంటనే స్పందించాలని, మానవతా దృక్పథంతో అర్థం చేసుకోవాలని సూచించారు బండి సంజయ్ కుమార్.
తనను అరెస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి పార్టీని ఏకి పారేశారు కేంద్ర మంత్రి. ఆ పార్టీకి క్యాడర్ లేదన్నారు. జనం వారిని నమ్మే స్థితిలో లేరన్నారు . దయచేసి విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. లేక పోతే ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్.