NEWSTELANGANA

సీఎం అవ‌గాహ‌న రాహిత్యం రాష్ట్రానికి శాపం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఏనుగుల రాకేశ్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. ఒక బాధ్య‌త క‌లిగిన ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్నాన‌న్న సోయి లేకుండా , పూర్తిగా అవ‌గాహ‌న రాహిత్యంతో మాట్లాడటం స‌బబు కాద‌న్నారు. ఆదివారం రాకేశ్ రెడ్డి ఎక్స్ వేదిక‌గా స్పందించారు. సీఎంను ఏకి పారేశారు.

విష‌యం కూలంకుశంగా ఎవ‌రో స్క్రిప్ట్ రాసి ఇస్తే చ‌దివితే ఎలా అని ప్ర‌శ్నించారు. తాను నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకానికి ప్ర‌తినిధి అన్న విష‌యం మ‌రిచి పోతే ఎలా అని నిల‌దీశారు బీఆర్ఎస్ నేత‌. బాధ్య‌తా రాహిత్యంతో మాట్లాడ‌టంతో తెలంగాణ‌కు ఉన్న ప‌రువు కాస్తా పోయేలా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.

తెలంగాణ సిఎం కు వాళ్ల ప్రభుత్వం తెచ్చిన జివో సారాంశమే సరిగ్గా తెలియదని చెప్పితే ఇజ్జత్ పోయేలా ఉందంటూ ఎద్దేవా చేశారు. పట్టపగలే పచ్చి అబద్ధాలు ఆడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 55 నిబంధనలను ఉటంకిస్తూ మీరు తెచ్చిన జీవో 29 అదే అనటం మీ అవగాహన రాహిత్యాన్ని బట్ట బయలు చేస్తున్న‌ద‌ని , తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.

త‌మ పార్టీ నాయ‌కుడు కేటీఆర్ జీవో 29 కు జీవో 55 కు మ‌ధ్య తేడాను అర్థం అయ్యేలా విడ‌మ‌రిచి చెప్పార‌ని , క‌నీసం దానినైనా చూసి నేర్చుకుంటే బావుండేద‌న్నారు. అస‌లు సీఎంకు , స‌ర్కార్ కు స‌ల‌హాదారులుగా ఉన్న వాళ్లు నిద్ర పోతున్నారా అని ప్ర‌శ్నించారు.