NEWSANDHRA PRADESH

ఏపీలో వ‌ర్షాలు కురిసే ఛాన్స్

Share it with your family & friends

హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ శాఖ

అమ‌రావ‌తి – ఏపీలో రాబోయే కొన్ని గంట‌ల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని రాష్ట్ర వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఆదివారం ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.. రాగల 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళా ఖాతం , దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది .

అక్టోబరు 22 ఉదయం నాటికి ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి బలపడి వాయూ గుండం గా మారుతుందని స్ప‌ష్టం చేసింది వాతావ‌ర‌ణ శాఖ‌. 23వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం పై తుఫాను గా మారుతుందని తెలిపింది. ఆ తర్వాత, ఇది వాయువ్య దిశగా కదులుతూ 24న ఉద‌యం నాటికి వాయువ్య బంగాళా ఖాతం ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది వాతావ‌ర‌ణ శాఖ‌.

నైరుతి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతమైన ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంద్రప్రదేశ్ తీర ప్రాంతములో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టంనకు 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతి దిశగా వంగి ఉంటుందని పేర్కొంది.

దీంతో రాబోయే మూడు రోజులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది.