కీవీస్ విజయం భారత్ పరాజయం
8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు
బెంగళూరు – బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టు లో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. భారత జట్టు ఏ మాత్రం ప్రతిఘటించ లేక పోయింది. కీవీస్ ను కట్టడి చేయలేక పోయారు భారత బౌలర్లు. భయ పెడతాడని అనుకున్న బుమ్రా నిరాశ పర్చగా మిగతా బౌలర్లు సైతం సేమ్ సీన్ కే పరిమితం కావడం విస్తు పోయేలా చేసింది.
వర్షం వస్తే కాస్తంత సేద దీరొచ్చని, దాంతోనైనా జట్టును అపజయం బారి నుంచి కాపాడు కోవచ్చని ఆశించిన ఫ్యాన్స్ కు ఊరట నిచ్చేలా చేయలేక పోయారు ఆటగాళ్లు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడమే కొంప ముంచింది.
ఇండియా అత్యంత అత్యల్ప స్కోర్ కే తొలి ఇన్నింగ్స్ లో చాప చుట్టేసింది. మనోళ్లు చేసిన రన్స్ పట్టుమని 46 పరుగులు. ఇక పంత్ ఒక్కడే 20 రన్స్ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో దంచి కొట్టారు. 107 పరుగుల లక్ష్యాన్ని ముందుంచారు. న్యూజిలాండ్ కు ఇది ఈజీ టార్గెట్. ఆడుతూ పాడుతూ పని పూర్తి కానిచ్చేశారు . ఓటమితో వెనుదిరిగారు మనోళ్లు.
ఇక చెప్పుకోవాల్సింది ఈ టెస్టులో అద్భుతమైన సెంచరీలతో ఆకట్టుకున్నారు యువ ఆటగాళ్లు. వారిలో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా ఆడితే పంత్ తన ప్రతాపాన్ని చూపించడం విశేషం. ఇంతకు మించి చెప్పుకోవాల్సింది ఇంకేమీ లేదు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చినా టీమిండియా ఆట తీరు మారక పోవడం గమనార్హం.