SPORTS

రెండో టెస్టుకు వాషింగ్ట‌న్ సుంద‌ర్

Share it with your family & friends

మూడో టెస్టు కూడా బీసీసీఐ ప్ర‌క‌ట‌న

ముంబై – బీసీసీఐ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న మూడు టెస్టుల సీరీస్ లో భాగంగా తొలి టెస్టు బెంగ‌ళూరులో ముగిసింది. 8 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది భార‌త జ‌ట్టు. జ‌ట్టుకు హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ వ‌చ్చినా సీన్ మార లేదు.

ఈ సంద‌ర్బంగా జ‌ట్టులో కీల‌క మార్పు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది బీసీసీఐ. ఈ మేర‌కు ఆదివారం ఎక్స్ వేదిక‌గా స్పందించింది. ఈనెల 24న జ‌రిగే రెండో టెస్టు మ్యాచ్ తో పాటు న‌వంబ‌ర్ 1న జ‌రిగే మూడో టెస్టు మ్యాచ్ కు భార‌త జ‌ట్టులోకి వాషింగ్ట‌న్ సుంద‌ర్ ను ఎంపిక చేసిన‌ట్లు వెల్ల‌డించింది. బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ సిఫార‌సు చేసింద‌ని తెలిపింది.

ఇక కీవీస్ తో జ‌రిగే 2వ‌, 3వ టెస్టుకు సంబంధించి జ‌ట్టును ప్ర‌క‌టించింది. భారత జట్టు ఇలా ఉంది. రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), ధృవ్ జురెల్ (డబ్ల్యుకె) ), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్.