సీఎం నిర్వాకం గంగాపురం ఆగ్రహం
ముత్యాలమ్మ గుడిపై స్పందించ లేదు
హైదరాబాద్ – కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పుతోందని అన్నారు. ప్రధానంగా సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ గుడిలో అమ్మ వారిని తొలగించే ప్రయత్నం చేస్తే ఎందుకు ఇప్పటి వరకు స్పందించ లేదంటూ నిప్పులు చెరిగారు.
ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఆయన మాటలు కోటలు దాటుతున్నాయని, అసలు పాలన అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు గంగాపురం కిషన్ రెడ్డి.
ఇంత జరుగుతున్నా శాంతియుతంగా ఆందోళన చేపడితే దాడులకు దిగుతారా అంటూ ప్రశ్నించారు. ఇదనే ప్రజా పాలన అని భగ్గుమన్నారు. ఆలయంపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో చూస్తూ మనసు బాధకు లోనవుతోందన్నారు. ఏ వ్యక్తి అయినా సరే చలించక తప్పదన్నారు.
కానీ ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు పల్లెత్తు మాట మాట్లాడక పోవడం దారుణమన్నారు జి. కిషన్ రెడ్డి. ఏ తప్పు చేశారని యువకులపై లాఠీఛార్జ్ చేశారంటూ ఫైర్ అయ్యారు. కనీసం నిరసన , ఆందోళన తెలిపే హక్కు కూడా లేదా అని అన్నారు కేంద్ర మంత్రి.