బైడన్ సర్కార్ పై ట్రంప్ ఫైర్
అమెరికన్లకు రక్షణ కరువైంది
అమెరికా – అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సందర్బంగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో అధ్యక్ష బరిలో నిలిచిన అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొని ప్రసంగించారు.
ప్రస్తుత జోసెఫ్ బైడెన్ సర్కార్ ను ఏకి పారేశారు. అమెరికాలో నివసిస్తున్న అమెరికన్లకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా పరాయి వారిగా మారి పోయారని మండిపడ్డారు. దీనికంతటికి కారణం మీరేనంటూ బైడెన్ , కమలా హారీస్ లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానంగా దేశంలో నివసిస్తున్న క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు డొనాల్డ్ ట్రంప్. ప్రతిక్షణం బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారని అన్నారు. చాలా మందికి ఓటు హక్కు లేకుండా పోయిందని, దీనికి మీరే కారకులంటూ ప్రస్తుత ప్రభుత్వాన్ని నిందించారు.
ఎవరూ కూడా ఆందోళనకు గురి కావద్దని, పెన్సిల్వేనియాలో నమోదు చేసుకోవడానికి సమయం ఉందని, వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు క్రైస్తవులకు డొనాల్డ్ ట్రంప్.