సర్కార్ వైఫల్యం రోజా ఆగ్రహం
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం
అమరావతి – మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందన్నారు. ఏ ఒక్కరికీ రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందారు. కూటమి సర్కార్ కొలువు తీరాక దారుణాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, కేసులు ఎక్కువై పోయాయని వాపోయారు.
ఆర్కే రోజా సెల్వమణి మీడియాతో మాట్లాడారు. ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతికే పరిస్థితికి తీసుకు వచ్చారని ఆరోపించారు. ఓ వైపు దారుణాలు జరుగుతున్నా ఇంకో వైపు తమ ప్రభుత్వం అద్బుతం అంటూ గొప్పలు చెబుతూ కాలం గడుపుతున్నారంటూ ధ్వజమెత్తారు ఆర్కే రోజా సెల్వమణి.
ఆమె ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. డిప్యూటీ సీఎం ఉన్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీని టార్గెట్ చేయడం, తమ నాయకుడిపై లేని పోని ఆరోపణలు చేయడం, బురద చల్లే ప్రయత్నం తప్పా చేసింది ఒక్క మంచి పని లేదన్నారు ఆర్కే రోజా సెల్వమణి.
ప్రచార ఆర్భాటం తప్పా ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి పాలనను భ్రష్టు పట్టించారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు ఆర్కే రోజా సెల్వమణి.