ప్రతి కథకు మరో కోణం ఉంటుంది – సీపీ
బీజేపీ నేతల ఆరోపణలు అబద్దం
హైదరాబాద్ – హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఎక్స్ వేదికగా సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయానికి సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ సందర్బంగా ప్రతి కథకు మరో కోణం ఉంటుందని పేర్కొన్నారు.
శాంతియుతంగా నిరసన తెలిపే ప్రతి ఒక్కరికీ ఉంటుందని , దానిని తాము కూడా గౌరవిస్తామని స్పష్టం చేశారు సీవీ ఆనంద్. ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందనే దానికి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందుకు సాక్ష్యాలను , సీసీ టీవీ ఫుటేజ్ లను వెల్లడించారు. ఈ సందర్బంగా బహిర్గతం చేసిన వీడియోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ఇందులో ఆందోళనకారులు పోలీసులపై దాడులు చేయడం స్పష్టంగా కనిపించింది. దానిని కంట్రోల్ చేసేందుకే పోలీసులు లాఠీఛార్జ్ జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. కొందరు పనిగట్టుకుని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, వాటిని నమ్మ వద్దని కోరారు .
దీని కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందన్నారు. ప్రజల మధ్య సామరస్య పూర్వకంగా మెలిగేలా ప్రయత్నం చేయాలని సూచించారు. ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు సీవీ ఆనంద్. తాము షేర్ చేసిన వీడియోలను క్షుణ్ణంగా చూడాలని, ఎవరిది తప్పు అనేది అర్థం అవుతుందని పేర్కొన్నారు నగర బాస్.