NEWSANDHRA PRADESH

జ‌నాభా త‌గ్గుద‌ల‌పై బాబు ఆందోళ‌న

Share it with your family & friends

ఎక్కువ మందిని క‌నాల‌ని సూచ‌న

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారారు. మొన్న‌టికి మొన్న తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం త‌యారీలో క‌ల్తీ జ‌రిగింద‌ని ప్ర‌క‌టించారు. దీంతో దేశ‌మంత‌టా చ‌ర్చ‌కు దారితీసేలా చేశారు.

తాజాగా మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దేశ ప్ర‌యోజ‌నాల కోసం ద‌క్షిణ భార‌తీయులు ఎక్కువ మంది పిల్ల‌ల‌ను క‌నాల‌ని పిలుపునిచ్చారు. లేక పోతే దేశ జ‌నాభాలో మ‌న జ‌నాభా త‌క్కువ‌య్యే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇందుకు సంబంధించి మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేశారు ఏపీ సీఎం. అదేమిటంటే ఎక్కువ మంది పిల్ల‌ల‌ను క‌నాల‌ని కోరుతూ ఏకంగా రాష్ట్రంలో ప్ర‌త్యేకంగా చ‌ట్టాన్ని తీసుకు వ‌స్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు మాత్రమే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగా ఈ చ‌ట్టంలో చేరుస్తామ‌ని పేర్కొన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

వృద్ధాప్యం అవుతున్న దక్షిణాది రాష్ట్రాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “భారతదేశం సగటు జనాభా పెరుగుదల 1950లలో 6.2% నుండి 2021 నాటికి 2.1 శాతానికి క్షీణించింది. ఇక‌ ఆంధ్రాలో అది కేవలం 1.6 శాతానికి తగ్గింది” – ఆయన చెప్పారు.