ఆడపిల్లలకు గోహిల్ ఆసరా
30 లక్షల మంది మహిళలకు
న్యూఢిల్లీ – ఎవరీ మిత్తల్ గోహిల్ అనుకుంటున్నారా. ఆడపిల్లలు, మహిళలు, యువతలకు ఆసరాగా నిలుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 లక్షల మంది మహిళల్లో వెలుగులు పంచేందుకు ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారారు. ఆమె చేసిన గొప్ప ప్రయత్నం ఏమిటంటే నిత్యం యువతులు ఎదుర్కొనే పీరియడ్స్ విషయంపై ఫోకస్ పెట్టారు.
ఇక మిత్తల్ గోహిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆడపిల్లలు చదువు కోవడం, ఉద్యోగం చేయడం తప్పుగా భావించే పల్లెలో పుట్టారు మిత్తల్ గోహిల్. తను కూడా చదువుకుని, తన లాంటి వారికి అండగా నిలవాలని అనుకుంది. వారికి ఆసరా కావాలని భావించింది. ఈ మేరకు ఏకంగా దేశాయ్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు.
కొన్నేళ్లుగా ప్లేజర్ పీరియడ్ పేరుతో దాదాపు లక్షల మంది మహిళలకు అండగా నిలిచింది. ప్రస్తుతం దేశమంతటా చర్చ జరుగుతోంది. మిత్తల్ గోహిల్ ఎలాంటి లాభా పేక్ష లేకుండా చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ఆశయం గొప్పదని , అంతా సహకరించాలని కోరుతున్నారు. హ్యాట్సాఫ్ మిత్తల్ గోహిల్.