బ్రిక్స్ సమ్మిట్ కు నరేంద్ర మోడీ
కజాన్ కు బయలు దేరిన ప్రధాని
ఢిల్లీ – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ మంగళవారం రష్యాకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యావత్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న బ్రిక్స్ సదస్సుకు తాను హాజరు కావడం పట్ల సంతోషంగా ఉందన్నారు.
మంగళవారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన రష్యాలోని కజాన్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బయలు దేరి వెళ్లారు. ఇక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ 16వది కావడం విశేషం.
రష్యా అధ్యక్షుడు, మోడీ చిరకాల మిత్రుడు అయిన వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా రావాలంటూ ఆహ్వానం పంపించారని తెలిపారు నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఈ బ్రిక్స్ సమావేశంలో గ్లోబల్ డెవలప్మెంట్ ఎజెండా, సంస్కరించబడిన బహుపాక్షికత, వాతావరణ మార్పు, ఆర్థిక సహకారం, స్థితిస్థాపక సరఫరా గొలుసులను నిర్మించడం, సాంస్కృతికంగా ప్రజలను కనెక్ట్ చేయడం వంటి సమస్యలపై చర్చలు జరగనున్నాయని స్పష్టం చేశారు ప్రధానమంత్రి.
చర్చలకు ముఖ్యమైన వేదికగా ఉద్భవించిన బ్రిక్స్‌లోని సన్నిహిత సహకారాన్ని భారతదేశం విలువైనదిగా భావిస్తుందన్నారు. . గత సంవత్సరం కొత్త సభ్యుల చేరికతో బ్రిక్స్ విస్తరణ ప్రపంచ ప్రయోజనాల కోసం ఎజెండాను జోడించిందన్నారు.
జూలై 2024లో మాస్కోలో జరిగిన వార్షిక శిఖరాగ్ర సమావేశం ఆధారంగా, కజాన్‌లో నా పర్యటన భారతదేశం , రష్యా మధ్య ప్రత్యే, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ.