NEWSANDHRA PRADESH

కేంద్ర మంత్రితో గొట్టిపాటి ల‌క్ష్మి భేటీ

Share it with your family & friends

దొన‌కొండ ప్రాంతాన్ని అభివృద్ది చేయండి

అమ‌రావ‌తి – కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, ద‌ర్శి పార్టీ ఇంఛార్జి గొట్టిపాటి ల‌క్ష్మి మంగ‌ళ‌వారం భేటీ అయ్యారు. ఇవాళ అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ లో ఆయ‌న‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా దొన‌కొండ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు కేంద్ర మంత్రిని.

సమ్మిట్ లో ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడును కూడా క‌లిశారు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. దొనకొండ వెనుకబడిన ప్రాంతమని, వలసలను నివారించే లక్ష్యంతో విమానాశ్రయానికి కేటాయించిన 354 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని డాక్టర్ లక్ష్మికి వివ‌రించారు.

ముఖ్యంగా పౌర విమానయాన అనుబంధ కేంద్రంగా వెనుకబడిన ఈ ప్రాంతాన్ని వినియోగించు కోవాలని ఈ విధంగా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందించి యువతకు ఉపాధి కల్పించాలని ఆమె కోరారు.

దర్శి ప్రాంత ప్రజల చిరకాల వాంచగా ఉన్న దొనకొండ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి మన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కృషి చేయాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు.