NEWSNATIONAL

లారెన్స్ బిష్ణోయ్ ని చంపితే రూ. కోటి

Share it with your family & friends

రివార్డ్ ప్ర‌క‌టించిన క‌ర్ణి సేన సంస్థ చీఫ్
ఢిల్లీ – క‌ర్ణి సేన చీఫ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌ముఖ గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ ని గ‌నుక ఎవ‌రైనా చంపినా లేదా పోలీసులు ఎన్ కౌంట‌ర్ చేసినా వారికి రూ. కోటి రివార్డు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా వీడియోను విడుద‌ల చేశారు క‌ర్ణి సేన చీఫ్ రాజ్ షెకావ‌త్. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న వైర‌ల్ గా మారింది.

ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది క‌ర్ణి సేన మాజీ చీఫ్ సుఖ్ దేవ్ సింగ్ గొగ‌మేడిని హ‌త మార్చారు. ఈ హ‌త్య‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉంద‌ని తామే ప్ర‌క‌టించారు స‌ద‌రు గ్రూప్ . పోలీసుల‌కు స‌వాల్ విసిరారు. ఇప్ప‌టి వ‌ర‌కు దీని విష‌యంలో ఎందుకు స్పందంచ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. ఇదే స‌మ‌యంలో జైలులోనే లారెన్స్ బిష్ణోయ్ ని గ‌నుక ఎన్ కౌంట‌ర్ చేస్తే భారీ ఎత్తున న‌గ‌దు బ‌హుమ‌తి ఇస్తామ‌ని ప్ర‌కటించారు ప్ర‌స్తుత క‌ర్ణి సేన సంస్థ చీఫ్‌.

డాక్టర్ రాజ్ షెకావత్ ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో రూ.1,11,11,111 రివార్డు ప్రకటించారు. లారెన్స్ వ‌ల్ల దేశానికి ప్ర‌మాదం పొంచి ఉంద‌న్నాడు. భార‌తీయ జ‌న‌తా పార్టీ, గుజ‌రాత్ ప్ర‌భుత్వాలు ఇందుకు బాధ్య‌త వ‌హించాల‌ని అన్నాడు రాజ్ షెకావ‌త్.

మన విలువైన రత్నం , వారసత్వం సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని చంపిన లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసుకు క్షత్రియ కర్ణి సేన రూ. 1,11,11,111/- (ఒక కోటి పదకొండు లక్షల పదకొండు వేలు) బహుమతిగా ఇస్తుంద‌న్నారు. ఆ ధైర్యవంతుడైన పోలీసు కుటుంబానికి భద్రత క‌ల్పించ‌డం తామే చూసుకుంటామ‌ని ప్ర‌క‌టించాడు రాజ్ సుఖ్ దేవ్.