రైతుల జోలికి ఎవరొచ్చినా ఊరుకోం
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
అమరావతి – కేంద్ర టెలికాం శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన రైతులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు సంబంధించి తమ కూటమి ప్రభుత్వం మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేయాలని చూస్తున్నాయని, రైతుల జోలికి ఎవరు వచ్చినా తాము చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు కేంద్ర మంత్రి. మిర్చి పండించిన రైతులకు కేవలం రెండు వారాల్లోనే న్యాయం చేశామని స్పష్టం చేశారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.
నిందితుల ఆస్తులు అటాచ్ చేయించి, 32 మంది రైతులకు కోటి 60 లక్షల నష్ట పరిహారం అందేలా చేశామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి చొరవ కారణంగా రైతులకు న్యాయం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు.
పెమ్మసాని ఢిల్లీ నుంచి రోజూ రైతుల గురించి అడిగారని, ఆయన తీసుకున్న చొరవ వల్లనే సమస్యకు పరిష్కారం లభించిందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడం జరిగిందని తెలిపారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి.