ENTERTAINMENT

హ్యాపీ బ‌ర్త్ డే రాజా సాబ్ – రామ జోగ‌య్య శాస్త్రి

Share it with your family & friends


వెల్లువెత్తుతున్న పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ – తెలుగు సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌భాస్ పుట్టిన రోజు ఇవాళ‌. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌టుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ సినీ గేయ ర‌చ‌యిత రామ జోగ‌య్య శాస్త్రి ఎక్స్ వేదిక‌గా న‌టుడు ప్ర‌భాస్ కు జ‌న్మ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌టన‌లోనూ , వ్య‌క్తిత్వంలోనూ త‌న‌కు త‌నే సాటి అంటూ కొనియాడారు ప్ర‌భాస్ గురించి.

ఆయ‌న‌కు పాట‌లు రాసే అవ‌కాశం ద‌క్క‌డం ప‌ట్ల తాను ఎల్ల‌ప్పుడూ సంతోషానికి లోన‌వుతాన‌ని పేర్కొన్నారు రామ జోగ‌య్య శాస్త్రి. చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రితో క‌లిసి పోయే గొప్ప గుణం ఆయ‌న స్వంతం అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ధానంగా ప్ర‌భాస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన సినిమాలు ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యాయి. అందులో ఛ‌త్ర‌ప‌తి కాగా మ‌రొక‌టి బాహుబ‌లి. ఈ రెండు సినిమాలు ప్ర‌భాస్ కెరీర్ లో ఉత్త‌మ స్థానానికి తీసుకు వెళ్లేలా చేశాయి. ఇవాళ టాప్ ఇండియన్ స్టార్ గా పేరు పొందాడు.

ప్ర‌భాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్య నారాయణ ప్రభాస్ రాజు . అక్టోబ‌ర్ 23, 1979లో పుట్టాడు . భార‌త దేశ సినీ చ‌రిత్ర‌లో ఎక్కువ పారితోష‌కం తీసుకునే న‌టుడు కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. ఇందులో ల‌వ‌ర్ గా న‌టిస్తుండ‌డం తో మ‌రింత ఆస‌క్తి రేపుతోంది. సినిమా పేరు కూడా ఖ‌రారు చేశాడు ద‌ర్శ‌కుడు. అదే రాజా సాబ్.