రెబల్ స్టార్ కు మెగాస్టార్ బర్త్ డే విషెస్
ఆ కట్ అవుట్ చూసి అన్నీ నమ్మేయాలి
హైదరాబాద్ – రెబల్ స్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. బుధవారం ఎక్స్ వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన ప్రేమ పూర్వకమైన వ్యాఖ్యలు చేశారు ప్రభాస్ గురించి.
ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి . నువ్వు ప్రేమించే పద్దతి చూసి తిరిగి అమితంగా ప్రేమించేస్తాం అంటూ పేర్కొన్నారు చిరంజీవి. నువ్వు కలకాలం చల్లంగా ఉండాలని అని మెగాస్టార్ కోరారు. ఇదిలా ఉండగా ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23 కావడంతో దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను రాజమౌళి దర్శకత్వంలో నటించిన సినిమాలు ఎక్కువగా పాపులర్ అయ్యాయి. అందులో ఛత్రపతి కాగా మరొకటి బాహుబలి. ఈ రెండు సినిమాలు ప్రభాస్ కెరీర్ లో ఉత్తమ స్థానానికి తీసుకు వెళ్లేలా చేశాయి. ఇవాళ టాప్ ఇండియన్ స్టార్ గా పేరు పొందాడు.
ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్య నారాయణ ప్రభాస్ రాజు . అక్టోబర్ 23, 1979లో పుట్టాడు . భారత దేశ సినీ చరిత్రలో ఎక్కువ పారితోషకం తీసుకునే నటుడు కావడం విశేషం. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇందులో లవర్ గా నటిస్తుండడం తో మరింత ఆసక్తి రేపుతోంది. సినిమా పేరు కూడా ఖరారు చేశాడు దర్శకుడు. అదే రాజా సాబ్.