రోడ్డెక్కినా స్పందించని సర్కార్ – రాకేశ్ రెడ్డి
గాడి తప్పిన పాలనపై అన్ని వర్గాలు ఆగ్రహం
హైదరాబాద్ – ప్రజా పాలన అందిస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని పేర్కొన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. 2 లక్షల జాబ్స్ ఇస్తామని నమ్మించారని, నిరుద్యోగులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను పర్మినెంట్ చేస్తామని చెప్పిన హామీ గురించి ఇప్పుడు ఊసెత్తడం లేదన్నారు.
ఓ వైపు నిరుద్యోగులు మరో వైపు ప్రభుత్వం , ఇంకో వైపు పోలీసుల భార్యా పిల్లలు అంతా రోడ్డెక్కారని, తమకు న్యాయం చేయాలని కోరినా , శాంతియుతంగా ఆందోళన చేపట్టినా ఇప్పటి వరకు సర్కార్ స్పందించక పోవడం దారుణమన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
పేరుకు మాత్రం ప్రజా పాలన అని ఆచరణలో చూస్తే రాచరిక పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రతి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలంతా తిరగబడే రోజు తప్పకుండా వస్తుందని హెచ్చరించారు.
సీఎం ఎ. రేవంత్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టడం భావ్యం కాదని హితవు పలికారు. ఇకనైనా ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.