NEWSANDHRA PRADESH

దానా తుఫాన్ తీరం దాటే ఛాన్స్

Share it with your family & friends

ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ

అమరావ‌తి – ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి హెచ్చ‌రిక చేసింది విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌. బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.తూర్పు మధ్య బంగాళా ఖాతంలో ‘దానా’ తుపాన్ నెల‌కొంద‌ని పేర్కొంది.

రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా రూపాంతరంగా మార‌నుంద‌ని హెచ్చ‌రించింది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో తుపాను క‌దులుతోంద‌ని పేర్కొంది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉంద‌ని వెల్ల‌డించింది ఏపీ వాతావ‌ర‌ణ శాఖ‌.

పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా మరియు ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటనుంద‌ని తెలిపింది. ప్రస్తుతానికి పారాదీప్ (ఒడిశా)కి 520 కిమీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 600 కిమీ మరియు ఖేపుపరా (బంగ్లాదేశ్)కి 610 కిమీ. దూరంలో దానా తుపాన్ ఉంద‌ని తెలిపింది.

దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి ఈరోజు మధ్యాహ్నం నుంచి గంటకు 80-100 కిమీ వేగంతో ఈదురు గాలులు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది.

రేపు రాత్రి నుంచి 100-110 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంద‌ని పేర్కొంది. తుపాన్ తీవ్ర‌త కార‌ణంగా భారీ వృక్షాలు, చెట్ల దగ్గర కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దని సూచించింది.

ఎండిపోయిన చెట్లు, విరిగిన కొమ్మలను తొలగించండి వాటి కింద ఉండకండి అని తెలిపింది. వేలాడుతూ, ఊగుతూ ఉండే రేకు, మెటల్( ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండాల‌ని సూచించింది. పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండ వ‌ద్ద‌ని పేర్కొంది.

కరెంట్, టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు, హోర్డింగ్స్ కు దూరంగా ఉండాల‌ని సూచించింది.