జగనన్నా నీకిది తగునా – వైఎస్ షర్మిల
తండ్రి ఆస్తిలో సోదరికి కూడా వాటా నిజం
అమరావతి – ఏపీలో కొత్త పంచాయతీ మొదలైంది. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కుటుంబం రచ్చకెక్కింది. ఆస్తుల పంపకాల విషయంలో లొల్లి కలకలం రేపుతోంది. ఆస్తులకు సంబంధించి వాటాలు ఇచ్చేది లేదంటూ బహిరంగంగానే ప్రకటించాడు వైసీపీ బాస్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏకంగా ఆయన కోర్టుకు ఎక్కారు. ఈ మేరకు ఫిర్యాదు చేయడం విస్తు పోయేలా చేసింది.
వాటాలు ఇవ్వనంటూ జగన్ రెడ్డితో పాటు భారతీ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ సందర్బంగా అన్నా, వదినెలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ రెడ్డి ఒక్కటే తన తండ్రికి తనయుడు కాదని, తాను కూడా రక్తం పంచుకు పుట్టానని, తన తల్లి ఇంకా బతికే ఉందన్న విషయం మరిచి పోకూడదని పేర్కొంది.
ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. “నా రాజకీయ జీవితం పూర్తిగా నాకు సంబంధించింది. నా వృత్తి పరమైన జీవితాన్ని నిర్దేశించడానికి నేను మిమ్మల్ని అనుమతించను. బహిరంగ వేదికలపై మీకు , అవినాష్‌కు వ్యతిరేకంగా మాట్లాడకుండా నాతో మీరు సంతకం చేయుంచు కున్నారన్నది అసంబద్ధం. సెటిల్‌మెంట్‌కు రావాలని నాకు షరతు విధించడం అనేది కూడా పూర్తిగా అసమంజసమైనది.”
మన తండ్రి అన్ని ఆస్తులలో తన మనవళ్లందరికీ . మానవరాలకి సమాన వాటా ఉండాలని కోరుకున్నాడని తెలిపారు. అంతే గాని దాని మీద రాజకీయమైన ప్రభావాలేవీ వుండ కూడదని స్పష్టం చేశారు. నా రక్త సంబంధమైన అన్నగా మీరు ఇష్ట పూర్వకంగా సంతకం చేసిన ఎంవోయూని అమలు చేయడం మీ బాధ్యత అని స్పష్టం చేశారు.