ఎవరీ నవ్య హరిదాస్..ఏమిటా కథ ..?
వాయనాడు ఉప ఎన్నికల్లో గట్టి పోటీ
కేరళ – అందరి కళ్లు ఇప్పుడు కేరళ లోని వాయనాడు పైన ఉన్నాయి. దీనికి కారణంగా ఇక్కడ రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందారు. దీంతో పాటు రాయ్ బరేలిలో కూడా గెలుపొందారు. గతంలో జరిగిన ఎన్నికల్లో తను అమేథిలో ఓడి పోయారు స్మృతీ ఇరానీ చేతిలో. అప్పుడు వాయనాడు రాహుల్ ను అక్కున చేర్చుకుంది. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించింది.
ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాయనాడుతో పాటు రాయ్ బరేలిలో రెండు చోట్ల పోటీ చేసి విజయం సాధించాడు. దీంతో వాయనాడును వదులుకున్నాడు. రాయ్ బరేలి ఎంపీగా కొనసాగుతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇదిలా ఉండగా వాయనాడులో ఎంపీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో ఆమెకు పోటీగా భారతీయ జనతా పార్టీ తరపున అభ్యర్థిగా బరిలో నిలిచారు నవ్య హరిదాస్. ప్రియాంక ఆమె నుంచి గట్టి పోటీ ఎదుర్కోనున్నారు.
వచ్చే నెల నవంబర్ 13న జరిగే ఉప ఎన్నికలకు ఎల్డీఎఫ్ తమ అభ్యర్థిగా సత్యన్ మొకరేని నిలబెట్టింది. వాయనాడు లో కొండ చరియలు విరిగి పడినప్పుడు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ ఎవరూ ఇక్కడ లేరని అంటోంది నవ్య హరి ప్రసాద్. ఇదిలా ఉండగా దేశంలోని 15 రాష్ట్రాలలోని 47 అసెంబ్లీ స్థానాలతో పాటు వాయనాడుకు కూడా పోలింగ్ జరగనుంది. మొత్తంగా గెలుపు అనేది నల్లేరు మీద నడక కాదని చెప్పక తప్పదు.