టర్కీకి భారత్ కోలుకోలేని షాక్
బ్రిక్స్ లో చేరేందుకు నో ఛాన్స్
ఢిల్లీ – పాకిస్తాన్ తో దోస్తానా చేస్తూ భారత్ పై పదే పదే నోరు పారేసుకుంటున్న టర్కీకి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది భారత దేశం. రష్యా లోని కజాన్ లో జరిగిన బ్రిక్స్ సదస్సులో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఇదే సమయంలో 5 ఏళ్ల తర్వాత చైనా చీఫ్ జిన్ పింగ్ తో పీఎం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదే సమయంలో బ్రిక్స్ లో చేరేందుకు టర్కీ ప్రయత్నం చేసింది. ఈ మేరకు ఆ దేశం తన మెంబర్ షిప్ పత్రాన్ని కూడా సమర్పించింది. అయితే భారత్ పూర్తిగా అడ్డుకుందని సమాచారం. దీంతో టర్కీ చేరికకు పూర్తిగా దారులు మూసుకు పోయాయి. మరో వైపు భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ కు కూడా సేమ్ సీన్ ఎదురైంది. దీంతో బ్రిక్స్ లో భారత్ పాత్ర ఎంత శక్తివంతమో తేలి పోయింది.
ఇదిలా ఉండగా 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ గ్రూప్లో అసోసియేట్ సభ్యత్వం కోసం అభ్యర్థనను సమర్పించారు. అయితే, సమ్మిట్ రెండో రోజు చివరి విలేకరుల సమావేశంలో, ఈ అంశంపై ఎటువంటి ప్రకటనలు చేయక పోవడం విశేషం.
అయితే దీనికంతటికీ ప్రధాన కారణం భారత దేశమేనని టర్కీ భావిస్తోంది. ఈ మేరకు కీలక ఆరోపణలు కూడా చేసింది. మొత్తంగా టర్కీని ఏకాకిని చేసింది ఇండియా.