NEWSTELANGANA

హ్యాపీ బ‌ర్త్ డే ఎండీ వీసీ స‌జ్జ‌నార్

Share it with your family & friends

ఆర్టీసీ ఎండీకి గ్రీటింగ్స్ వెల్లువ‌

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) వైస్ చైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ , సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ వీసీ స‌జ్జ‌నార్ పుట్టిన రోజు ఇవాళ‌. ఆయ‌న స్వ‌స్థ‌లం క‌ర్ణాట‌క‌. న‌ష్టాల‌లో , తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీని ఆయ‌న గ‌ట్టెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అక్టోబ‌ర్ 25న పుట్టిన రోజు వీసీ స‌జ్జ‌నార్ ది. ఆగ‌స్టు 25, 2021లో మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. స‌మ‌స్య‌ల నుంచి, ఇబ్బందుల నుంచి గ‌ట్టెక్కించేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. ఆధునిక సాంకేతిక‌త‌ను ఆర్టీసీకి జోడించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పోలీస్ శాఖా ప‌రంగా కొన్ని ఆరోప‌ణ‌లు ఉన్నా వృత్తి ప‌రంగా చాలా స్ట్రిక్ట్ అని పేరు పొందారు. అంతే కాదు అత్యంత నిజాయితీ క‌లిగిన ఆఫీస‌ర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

అక్టోబ‌ర్ 24 1968లో పుట్టారు. వీసీ స‌జ్జ‌నార్ వ‌య‌సు 55 ఏళ్లు. ఇప్ప‌టికీ చాలా కూల్ గా ఉంటారు. ప‌ని త‌ప్ప మ‌రో ధ్యాస ఉండ‌దు ఆయ‌న‌కు. ఆయ‌న పూర్తి పేరు చెన్న‌ప్ప బ‌సప్ప స‌జ్జ‌నార్. భార్య అనుప స‌జ్జ‌నార్. ఇద్ద‌రు కూతుళ్లు అదితి, నియ‌తి. ధార్వాడ్ లోని క‌ర్ణాట‌క యూనివ‌ర్శిటీలో చ‌దువుకున్నారు. 1996 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్. అద‌న‌పు డీజీపీ హోదాలో ప్రస్తుతం ఆర్టీసీకి వైస్ చైర్మ‌న్, ఎండీగా కొన‌సాగుతున్నారు . 2008లో వ‌రంగ‌ల్ యాసిడ్ దాడి కేసులో ఎన్ కౌంట‌ర్ , 2019 శంషాబాద్ దిశ ఎన్ కౌంట‌ర్ లు స‌జ్జ‌నార్ ను దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌ల్లో నిలిపేలా చేశాయి.