చంద్రబాబు నీ ఆస్తుల మాటేమిటి..?
మాజి మంత్రి పేర్ని నాని కామెంట్స్
అమరావతి – మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం , టీడీపీ బాస్ నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. తమ నాయకుడు జగన్ రెడ్డికి సంబంధించి ఆస్తుల గురించి అవాకులు చెవాకులు పేలడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ముందు చంద్రబాబు నాయుడు తన కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. చెప్పేది ఒకటి చేసేది మరోటి ఇది బాబు లక్షణమన్నారు. తన భార్య భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, కొడుకు నారా లోకేష్ కు సంబంధించి ఎన్ని కోట్లు వెనకేసుకున్నారో, ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో చెప్పాలన్నారు.
చంద్రబాబు నాయుడు మీ ఆస్తులు ఏనాడైనా మీ కుటుంబంలోని వారికి పంచారా అని నిలదీశారు పేర్ని నాని. మీ తమ్ముడికి మీ ఆస్తులను పంపిణీ చేశారా. చేస్తే ఏపీ ప్రజలకు తెలియ చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి.
అవసరానికి వాడుకోవడం ఆ తర్వాత పట్టించుకోక పోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. సోదరుడు నారా రామ్మూర్తి నాయుడుకు చిల్లిగవ్వ ఇచ్చారా అని ప్రశ్నించారు పేర్ని నాని.