‘మర్రి’ ఔదార్యం పేదింటి బిడ్డకు సాయం
ఎంబీబీఎస్ చదువు కోసం ఆర్థిక మద్దతు
నాగర్ కర్నూల్ జిల్లా – నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే , ఎంజీఆర్ ట్రస్టు చైర్మన్ మర్రి జనార్దన్ రెడ్డి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. పేదింటి ఆడ బిడ్డ చదువు కోసం ముందుకు వచ్చారు. ఈ మేరకు తన సంస్థ తరపున ఆర్థిక సాయం చేశారు. ఇందుకు సంబంధించి ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జెట్ ప్రోలు గ్రామానికి చెందిన సులిగురి ఉషమ్మ వెంకటయ్య దంపతుల కూతురు ప్రహర్ష కు నారాయణ పేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది.
దీంతో చదువుకునేందుకు తీవ్ర ఇబ్బంది ఏర్పడడంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమాలలో రావడంతో వెంటనే ఫోన్ చేసి పిలిపించారు.
ప్రహర్ష ఎంబీబీఎస్ చదవడానికి ఎంజేఆర్ ట్రస్టు సాయం చేస్తుందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని విద్యార్థినికి భరోసా ఇచ్చారు మర్రి జనార్దన్ రెడ్డి. ఇందులో భాగంగా మొదటి సంవత్సరం ఫీజు కింద రూ. 75,000 లను ఆర్థిక సహాయం అందజేశారు.
అంతే కాదు సంచలన ప్రకటన చేశారు మర్రి జనార్దన్ రెడ్డి. అమ్మాయి ఎంబీబీఎస్ పూర్తయ్యేంత వరకు తమ ట్రస్టు ద్వారానే ఫీజులు చెల్లిస్తామని, ఆమె కాళ్ల మీద నిలబడేంత వరకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థితో పాటు తల్లిదండ్రులు మాజీ ఎమ్మెల్యే ఔదర్యానికి, చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు.