కొండా సురేఖ జర నోరు జాగ్రత్త – కోర్టు
నాంపల్లి సివిల్ కోర్టు సీరియస్ కామెంట్స్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది నాంపల్లి సివిల్ కోర్టు. మాజీ మంత్రి కేటీఆర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ మంత్రిపై పిటిషన్ దాఖలు చేశారు. రూ.100 కోట్ల పరువు నష్టంతో పాటు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా కోర్టు ముందు హాజరయ్యారు. జడ్జి అడిగినా తాను తన నోటితో చెప్పలేనని, సురేఖ మాట్లాడిన మాటలను రాత పూర్వకంగా అందజేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్బంగా పరువు నష్టం కేసుకు సంబంధించి శుక్రవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక మహిళగా , బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ ఇలాంటి అనుచిత, జుగుస్సాకర వ్యాఖ్యలు చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేటీఆర్ గురించే కాదు ఇతరుల పట్ల కూడా గౌరవ ప్రదమైన భాష వాడాలని, అడ్డగోలు కామెంట్స్ చేయొద్దంటూ హెచ్చరించింది. కొండా సురేఖపై మెట్టి కాయలు వేసింది. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని పేర్కొంది. ఇందుకు సంబంధించి మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్ బుక్, గూగూల్, తదితర ప్లాట్ ఫారమ్ ల నుంచి తొలగించాలని ఆదేశించింది కోర్టు.