NEWSNATIONAL

మైనింగ్ స్కాం కేసులో ఎమ్మెల్యే దోషి

Share it with your family & friends

తేల్చి చెప్పిన క‌ర్ణాట‌క ప్ర‌త్యేక కోర్టు

క‌ర్ణాట‌క – క‌ర్ణాట‌క ప్ర‌త్యేక కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే స‌తీష్ సెయిల్ ను ప్ర‌త్యేక కోర్టు దోషిగా తేల్చింది. అక్ర‌మ మైనింగ్ కేసుకు సంబంధించి విచార‌ణ చేప‌ట్టింది. ఇందులో భాగంగా శుక్ర‌వారం కీల‌క తీర్పు వెలువ‌రించింది.

గనులు, అటవీ, రవాణా అనుమతులు లేకుండా బళ్లారి నుంచి బేలేకేరి ఓడరేవుకు దాదాపు ఎనిమిది లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని రవాణా చేసినట్లు లోకాయుక్త ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఎమ్మెల్యే స‌తీష్ సైల్ తో పాటు ఇత‌రుల‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ కేసును విచారించింది.

దోషులుగా నిర్దారించిన త‌ర్వాత ప్ర‌త్యేక కోర్టు ఎమ్మెల్యే, ఇత‌రుల‌ను క‌స్ట‌డీలోకి తీసుకోవాల‌ని ఆదేశించింది. కాగా చోరీ చేసిన ఇనుప ఖ‌నిజం అప్ప‌టి క‌న్జ‌ర్వేట‌ర్ అయిన మ‌హేష్ బిలియే , ఓడ రేవులో ఉన్న మ‌ల్లికార్జున్ షిప్పింగ్ కంప‌నీ స్టీవ్ డోర్ ఏజెన్సీల ద్వారా అక్ర‌మంగా ఎగుమ‌తి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా బెలెకేరి ఓడ రేవు నుంచి అక్ర‌మంగా ఎగుమ‌ద‌తి చేసిన మూడు కేసుల్లో సెయిల్, బిలియే, మ‌ల్లికార్జున్ కంపెనీల‌ను ప్ర‌త్యేక కోర్టు దోషులుగా తేల్చి చెప్పింది. కాగా మైనింగ్ స్కాం జ‌రిగిన స‌మ‌యంలో సెయిల్ ఓ వ్యాపారిగా గున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కార్వార్ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.