NEWSNATIONAL

కేజ్రీవాల్ పై దాడి దారుణం – సంజ‌య్ సింగ్

Share it with your family & friends

భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఓట‌మి భ‌యం

ఢిల్లీ – ఆప్ ఎంపీ సంజ‌య్ ఆజాద్ సింగ్ నిప్పులు చెరిగారు. త‌మ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ పై ప‌శ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో ఎన్నిక‌ల ర్యాలీ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో బీజేపీ కార్య‌క‌ర్త‌లు దాడికి పాల్ప‌డ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని, మోడీ, అమిత్ షా ఒంటెద్దు పోక‌డ‌ల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఢిల్లీలో సంజ‌య్ ఆజాద్ సింగ్ ఎన్నిక‌ల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా దాడి జ‌రిగిన విష‌యం తెలుసుకున్న వెంట‌నే ఆయ‌న హుటా హుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లారు. అర‌వింద్ కేజ్రీవాల్ ను ప‌రామ‌ర్శించారు.

ప్ర‌జాస్వామ్యంలో దాడుల‌కు చోటు లేద‌న్నారు. ఎవ‌రు పాల్ప‌డినా త‌ప్పేన‌ని అన్నారు . దీనిని సీరియ‌స్ గా తీసుకుంటున్నామ‌ని, ఆప్ చూస్తూ ఊరుకోద‌న్నారు. తాము దేశం కోసం విలువైన ప్రాణాన్ని బ‌లిదానం చేసిన ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ ను, భార‌త రాజ్యాంగాన్ని రాసిన డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ ను స్పూర్తిగా తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. దీనిని ప్ర‌తి ఒక్క‌రు ఖండించాల‌ని సంజ‌య్ ఆజాద్ సింగ్ డిమాండ్ చేశారు.