దాడి గర్హనీయం..అప్రజాస్వామికం
ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా
పంజాబ్ – ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యక్తులపై దాడులకు దిగడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదని, ఆ విషయం బీజేపీ నేతలు, కార్యకర్తలు గుర్తుంచు కోవాలని స్పష్టం చేశారు ఎంపీ రాఘవ్ చద్దా.
మోడీ, అమిత్ షా ఒంటెద్దు పోకడలకు ఈ దాడి నిదర్శనమని అన్నారు. తాము మాత్రమే ఈ దేశంలో ఉండాలని, మిగతా పార్టీలు, నేతలు ఉండ కూడదని వారు అనుకుంటున్నారని, అందుకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రాబోయే శాసన సభ ఎన్నికల్లో తాము ఎలాగైనా సరే గెలవాలని ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు రాఘవ్ చద్దా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. పిరికి వాళ్లు మాత్రమే దాడులకు పాల్పడతారని పేర్కొన్నారు.