వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీఏతో కలిసి పోటీ – సీఎం
స్పష్టం చేసిన నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్మలని అన్నారు. వారు లేక పోతే పార్టీనే లేదన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఎన్నో దారుణాలు జరిగాయాని, పనిగట్టుకుని తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను కావాలని వేధింపులకు గురి చేశారని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కానీ ఎక్కడా సంయమనం కోల్పోలేదన్నారు. ఎవరిపై దాడులకు తెగబడలేదని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
ఇదే సమయంలో మనందరం మరింత పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. 2029లో జరిగే ఎన్నికల్లోనూ టీడీపీ ఎన్డీయేతో కలిసి పోటీ చేస్తుందని ప్రకటించారు ఏపీ సీఎం.
ఆయన సంపూర్ణంగా తన మద్దతును పీఎం నరేంద్ర మోడీకి ప్రకటించారు. మండలాల వారీగా ఎన్డీయే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. జనసేన, బీజేపీ నేతలతో కలుపుకుని ముందుకు పోవాలని అన్నారు నారా చంద్రబాబు నాయుడు.