బాబు దుష్ప్రచారం పెద్దిరెడ్డి ఆగ్రహం
కరెంట్ ఛార్జీల పెంపు తగదని ఫైర్
అమరావతి – మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిక్స్ గ్యారెంటీల పేరుతో పవర్ లోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు.
కరెంట్ ఛార్జీలు పెంచమంటూనే పెంచి పెను భారం మోపారని , వెంటనే పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలని పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలపై రూ.6000 కోట్లు భారం మోపారని ఆరోపించారు.
పాలన చేతకాక నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ నాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రతీ దానికి జగన్ ఎలా కారణం అవుతారంటూ ప్రశ్నించారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.
విచిత్రం ఏమిటంటే రాష్ట్రంలో వరదలు వచ్చినా, అమరావతి మునిగినా, పడవలు కొట్టుకొచ్చినా తమ నాయకుడే కారణం అంటూ విష ప్రచారం చేయడం దారుణమన్నారు. ఇక నుంచి ఇలాంటి చిల్లర మల్లర కామెంట్స్ చేయడం మానుకోవాలని సూచించారు మాజీ మంత్రి.