యుద్ద ప్రాతిపదికన టిడ్కో ఇళ్లు పూర్తి కావాలి
స్పష్టం చేసిన మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి – రాష్ట్రంలో టిడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు ఏపీ పట్టణ, పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. శనివారం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తాగునీటి సరఫరా, వేస్ట్ మేనేజ్మెంట్, టౌన్ ప్లానింగ్, టిడ్కో ప్రాజెక్ట్ లపై జరిగిన సమీక్షలో పాల్గొన్నారు మంత్రి.
రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా ఉన్న చెత్త తొలగింపు ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు మంత్రి. అంతే కాకుండా సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ గాంధీ జయంతి నాటికి పక్కాగా జరగాలని ఆదేశించారు మంత్రిని సీఎం.
అమృత్ పథకం ద్వారా 7.5 లక్షల ఇళ్లకు కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చేలా పనులు పూర్తి చెయ్యాలని , తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు, ఇతర ప్రక్రియ వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సిఎం స్పష్టం చేశారు.
టిడ్కో ఇళ్ల ప్రాజెక్టు స్థితిగతులపైనా అధికారులు సిఎంకు వివరించారు.ఈ ప్రాజెక్టును సక్రమంగా పూర్తి చేసేందుకు అవసరమై నిధుల కేటాయింపునకు ప్రభుత్వం సిద్దంగా ఉందని..దీనిపై ప్రత్యేకంగా సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకుందామని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు.