పార్లమెంట్ కమిటీలో వైసీపీ ఎంపీకి చోటు
ఆర్అండ్ బి శాఖ కమిటీ సభ్యురాలిగా ఎంపిక
విశాఖపట్నం – వైఎస్సార్సీపీకి చెందిన అరకు -1 పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మ తుజా రాణికి కీలకమైన పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆమెకు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తోంది ఎంపీ.
తాజాగా మరో అదనపు బాధ్యతను అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా ఎంపీ డాక్టర్ గుమ్మ తుజారాణి భారత ప్రభుత్వం పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హౌసింగ్ మరియు అర్బన్ వ్యవహారాలు, (ఓబీసీ) జాతీయ ఇతర వెనకబడిన తరగతుల సంక్షేమ కమిటీ సభ్యురాలిగా నియమించింది.
తాజాగా మరో కీలకమైన శాఖలో సభ్యురాలిగా నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు శాఖలతో పాటు మరో శాఖకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
రోడ్డు, రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కమిటీ సభ్యురాలిగా డాక్టర్ గుమ్మ తుజా రాణిని నియమించింది. తనకు మూడు కమిటీలలో సభ్యురాలిగా నియమించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీకి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు.
అంతే కాకుండా తనకు అన్ని విధాలుగా సపోర్ట్ గా నిలిచి , ఎంపీ టికెట్ కేటాయించి మద్దతు ఇస్తున్న తమ పార్టీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు.