గులాబీ పెద్దలను కాపాడుతున్న సర్కార్ – బండి
నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి సంజయ్ కామెంట్స్
హైదరాబాద్ – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ కేవలం పైకి తిట్టినట్లు నటిస్తోందని , కానీ లోపాయికారిగా బీఆర్ఎస్ నేతలను కాపాడుతోందని ధ్వజమెత్తారు కేంద్ర మంత్రి.
విచిత్రం ఏమిటంటే ప్రస్తుత సర్కార్ కేవలం చట్టాన్ని అమలు చేస్తున్నట్లు పైకి భ్రమపడేలా చేస్తోందని కానీ వాస్తవానికి బీఆర్ఎస్ పెద్దలను కాపాడుతోందని ఆరోపించారు. కేటీఆర్ బినామీగా ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ సంగతి ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఎందుకని అక్రమ కట్టడం అని తేలినా ఎందుకని ఇప్పటి వరకు కూల్చ లేదంటూ నిప్పులు చెరిగారు బండి సంజయ్ కుమార్.
డ్రగ్స్ వ్యవహారంలో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వచ్చినా ఎందుకని కాపాడుతున్నారంటూ సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఊహాజనిత ప్రకటనలు ఇవ్వడం ద్వారా కేసును పలుచన చేయకూడదన్నారు.
ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న చందంగా బీజేపీ పెద్దలు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్దతి తయారైందని మండిపడ్డారు. ట్విట్టర్ టిల్లుగా పేరు పొందిన మాజీ మంత్రి కేటీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ నిలదీశారు బండి సంజయ్ కుమార్.