పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం – లోకేష్
పెట్టుబడిదారులకు సాదర స్వాగతం
అమెరికా – ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నెలాఖరు వరకు యుఎస్ లోనే పర్యటిస్తారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అవుతూ వస్తున్నారు. కీలకమైన వాణిజ్య, వ్యాపార, ఐటీ, లాజిస్టిక్ రంగాలకు చెందిన కంపెనీల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈవోలతో భేటీ అవుతూ వస్తున్నారు. తమ ప్రభుత్వం ఎలా పెట్టుబడిదారులకు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామనే దానిపై నారా లోకేష్ వివరిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మంచి ఎకో సిస్టం ఉందని స్పష్టం చేశారు. అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్ర అభివృద్దిలో భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు నారా లోకేష్.
ఈ సమావేశంలో హాజరైన పెట్టుబడిదారులు తమ ఆసక్తిని కనబర్చడం పట్ల వారందరికీ ధన్యవాదాలు తెలిపారు నారా లోకేష్.