కాంగ్రెస్ సర్కార్ బక్వాస్ – కిషన్ రెడ్డి
ఇచ్చిన హామీలన్నీ గాలి కబుర్లేనని ఫైర్
హైదరాబాద్ – కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలి వేసిందన్నారు . ఏ ఒక్కటి అమలు కావడం లేదన్నారు.
దీంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన వాటిని అమలు చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు కేంద్ర మంత్రి. లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కాంగ్రెస్ సర్కార్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు మోస పోయామని భావిస్తున్నారని పేర్కొన్నారు గంగాపురం కిషన్ రెడ్డి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం దారుణమన్నారు.
పెన్షన్లను రూ.4వే లకు పెంచుతామని చెప్పి.. ఇంత వరకు పెంచ లేదన్నారు. యువతకు నిరుద్యోగ భృతి గురించి ఇంకా సీఎం ఆలోచించడం లేదన్నారు కిషన్ రెడ్డి.. రైతుబంధు ఇవ్వడం లేదు. రైతుబంధు ఉందో, లేదో తెలియడం లేదని ఎద్దేవా చేశారు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు .