సిటిజన్ జర్నలిజానిదే భవిష్యత్తు
స్పష్టం చేసిన సీఈవో ఎలోన్ మస్క్
అమెరికా – టెస్లా చైర్మన్ , ఎక్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ ఎలోన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ను ఏకి పారేశారు. ఎవరికి తోచినట్లుగా వారు తమ అభిప్రాయాలను ప్రపంచం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ పేర్కొన్నారు.
ప్రస్తుతం అమెరికాలో దేశ అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా దిగ్గజ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన ఎలోన్ మస్క్ బేషరతుగా తన మద్దతును మాజీ అధ్యక్షుడు, బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ కు ప్రకటించారు. ఆయనకు ఓటు వేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
ఈ సందర్బంగా జరిగిన కీలక సమావేశంలో ఎలోన్ మస్క్ ప్రసంగించారు. సిటిజన్ జర్నలిజం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో సిటిజన్ జర్నలిజానికే మంచి భవిష్యత్తు ఉందని స్పష్టం చేశారు.
ప్రజలకు సంబంధించి లేదా సమాజానికి, ప్రపంచానికి సంబంధించి కొంత మంది ప్రధాన సంపాదకులు ఎలా తమ అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం చేస్తున్నారో పేర్కొన్నారు. ఇదే సమయంలో జర్నలిజం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉండాలని అన్నారు ఎలోన్ మస్క్.
జర్నలిజం ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అని స్పష్టం చేశారు. తాను ప్రతి ఒక్కరినీ రాయమని , తమ అభిప్రాయాలను పంచు కోవాలని ప్రోత్సహిస్తున్నానని అన్నారు .