రాహుల్ గాంధీకి కేంద్ర సర్కార్ షాక్
పార్లమెంటరీ కమిటీ నుంచి తొలగింపు
ఢిల్లీ – నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. లోక్ సభ లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీని తొలగిస్తున్నట్లు పేర్కొంది. పార్లమెంట్ లో అతి ముఖ్యమైన విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి రాహుల్ గాంధీని తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రస్తుతం డాక్టర్ సుబ్రమణ్యం జై శంకర్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పార్లమెంటరీ కమిటీ ప్రత్యేకంగా ఏర్పాటైంది. దేశానికి సంబంధించి ఈ శాఖ అత్యంత కీలకమైనది. ఇతర దేశాలతో సత్ సంబంధాలు నెలకొల్పేందుకు, ప్రత్యేకించి భద్రతా ఏర్పాట్లపై కూడా ఇది చర్చించింది. అవసరమైన సమయంలో కీలక నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది.
ఈ సంప్రదింపుల కమిటీ జాతీయ భద్రత , దేశ ప్రయోజనాల గురించి చర్చిస్తుంది. సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది. గత కొంత కాలంగా రాహుల్ గాంధీ ప్రధాని మోడీ, బీజేపీ, దాని అనుబంధ సంస్థలను, ప్రభుత్వాన్ని ఏకి పారేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సంప్రదింపుల కమిటీలో కాంగ్రెస్ పార్టీ నుండి మనీష్ తివారీ, గుర్జీత్ సింగ్ ఔజ్లా మాత్రమే ప్రస్తుతం సభ్యులుగా ఉన్నారు.