బీజేపీ సైద్ధాంతిక శత్రువు – విజయ్
డీఎంకే మా రాజకీయ శత్రువు
తమిళనాడు – టీవీకే అధ్యక్షుడు, ప్రముఖ నటుడు తళపతి విజయ్ నిప్పులు చెరిగారు. తమిళనాడులోని విల్లుపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ సంచలనంగా మారింది. తొలి సభలోనే అందరినీ విస్తు పోయేలా ప్రసంగించారు తళపతి విజయ్.
లక్షలాదిగా జనం తరలి వచ్చారు. రాజకీయాలలో మార్పు రాకూడదా అంటూ ఆయా పార్టీలను నేరుగా ప్రశ్నించారు. ఆయన దివంగత ప్రజా నాయకులు ఎన్టీఆర్, ఎంజీఆర్ లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇదే సమయంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకే, అన్నాడీఎంకే , భారతీయ జనతా పార్టీలకు కోలుకోలేని విధంగా భారీ జన సమీకరణతో విస్తు పోయేలా చేశారు తళపతి విజయ్.
తమిళనాడు రాజకీయాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగం సీరియస్ అన్నారు. అయినా సరే పాలిటిక్స్‌లో భయపడేది లేదని ప్రకటించారు. తాను ఒంటరిగానే పోరాడుతానని స్పష్టం చేశారు తళపతి విజయ్. ఈ సందర్బంగా బీజేపీతో తమకు సైద్ధాంతికరమైన శత్రుత్వం ఉందని, కానీ డీఎంకే ప్రధానంగా రాజకీయ శత్రువంటూ సంచలన కామెంట్స్ చేశారు.