విజయ్ కి అభినందనల వెల్లువ
సినీ రంగానికి చెందిన ప్రముఖులు
తమిళనాడు – ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ తళపతి విజయ్ సంచలనంగా మారారు. దేశ వ్యాప్తంగా ఆయన చర్చనీయం కావడం విశేషం. వల్లుపురం జిల్లాలో ఏర్పాటు చేసిన టీవీకే తొలి రాజకీయ సమావేశం సక్సెస్ అయ్యింది. ఈ సందర్బంగా లౌకిక వాదం, సమానత్వం తమ పార్టీ లక్ష్యమని ప్రకటించారు. పుట్టుకతో ప్రతి ఒక్కరు ఒక్కటేనని , కులం, మతం, అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాడుతామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా సినీ రంగానికి చెందిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు పెద్ద ఎత్తున తళపతి విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, ప్రభు అభినందించారు. డ్యాన్సర్, నటుడు లారెన్స్ అయితే తళపతి సక్సెస్ కావాలని ఆ రాఘవేంద్ర స్వామిని కోరుకుంటున్నానని అన్నారు.
నెల్లూరులో కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త షో రూమ్ ను ప్రారంభించిన అనంతరం నటుడు ప్రభు మీడియాతో మాట్లాడారు. విజయ్ కి తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు. మా నాన్న ఆశీస్సులు, నా సపోర్ట్ తప్పకుండా ఉంటుందన్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పరా్టీని ప్రారంభించ వచ్చని, సక్సెస్ కావాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.
జయం రవి, వసంత్ రవి, సీబీ సత్యరాజ్, అర్జున్ దాస్ , ప్రకాశ్ రాజ్ తళపతి విజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. సినీ రంగంలో మీరు చూపిన అంకిత భావం , రాజకీయాలలో కూడా తీసుకు రావాలని ఆకాంక్షించారు.
ప్రజల కోసం తన సినీ కెరీర్ ను వదులుకుని విజయ్ త్యాగం చేశాడని ఆర్జే బాలాజీ పేర్కొన్నారు. మీ రాజకీయ ప్రవేశం సామాన్య ప్రజలకు గొప్ప ఆశాజనకంగా మారాలని అన్నారు శశి కుమార్.