కాలుష్య నివారణపై ఫోకస్ పెట్టండి
స్పష్టం చేసిన మంత్రి నారాయణ
అమరావతి – కాలుష్య నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు ఏపీ పురపాలిక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ. నెల్లూరు కలెక్టరేట్ లో సహచర మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ లతో కలిసి రివ్వ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది
రైస్ మిల్స్ ఉన్న ఏరియాల్లో పొల్యూషన్ ఎక్కువగా ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయని, వాటి వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు పొంగూరు నారాయణ.
కేంద్ర ఎన్జీటీ నిబంధనల మేరకు రైస్ మిల్లులను వేరే ప్రాంతాలకు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
దినికిగాను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి నష్టం జరగకుండా తరలించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు పొంగూరు నారాయణ రైస్ మిల్లర్ల యజమానులు, అసోసియేషన్ నాయకులు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు మంత్రి.
జిల్లాకు ఎంతో అవసరమైన దగదర్తి విమానాశ్రయ పనులు కూడా త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు పొంగూరు నారాయణ. ఈ విషయమై ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రిని కుడా కలవటం జరిగిందని తెలిపారు. త్వరలోనే జిల్లా వాసుల కల నెరవేరబోతోందని అన్నారు.